: 'నీట్'పై స్టే ఇచ్చిన సుప్రీం
పాత విధానంలోనే వైద్య విద్యా ప్రవేశాలు నిర్వహించుకునేలా సుప్రీంకోర్టు నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'నీట్'పై సుప్రీం స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ ఏడాదికి రాష్ట్రంలో ఎంసెట్ ద్వారానే మెడికల్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. నీట్ పై జులై 2న తుది తీర్పు ఇవ్వనున్నారు. కాగా, తాజాగా సుప్రీం స్టే ద్వారా లభించిన వెసులుబాటు కేవలం ఈ ఒక్క ఏడాదికే పరిమితం.