: బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్మించాలి: సీపీఐ
కడప జిల్లా జమ్మలమడుగు వద్ద బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్మించాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడంతో ఉద్యమాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ శ్రేణులన్నీ బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేస్తూ, బ్రహ్మణికి కేటాయించిన గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా సీపీఐ నేతలు స్థానికంగా ఉక్కు కర్మాగారం నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటూ బద్వేలులో సంతకాల సేకరణ చేపట్టారు.