: పేదలపై పెనుభారం మోపుతున్న ప్రభుత్వం: చంద్రబాబు


తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి, 32వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్రలో భాగంగా ఆయన గుంటూరులో పర్యటిస్తున్నారు.

ఇక్కడి ఎన్టీఆర్ కూడలికి చేరుకోవడంతో ఆయన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పేదవారికి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో బిల్లులు తగ్గించేందుకు విద్యుత్ సంస్కరణలు చేపట్టామని, రోడ్ల అభివృద్ధి జరిగిందని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News