: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో గవర్నర్ భరద్వాజ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులు వీరప్ప మెయిలీ, పృథ్వీరాజ్ చవాన్, వి.హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.