: కోర్టుకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు
ఓ ప్రార్థనాస్థలం వివాదం కేసులో ఎంఐఎం ఎమ్మెల్యేలు కోర్టుకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలోని ఓ ప్రార్థనామందిరం కబ్జా, అక్కడి వ్యక్తులపై దాడికి సంబంధించిన వివాదంలో అక్బరుద్దీన్, బాషాఖాద్రీ, అఫ్సర్ ఖాన్, ముజాంఖాన్ జిల్లా కోర్టుకు హజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 15 కు న్యాయమూర్తి వాయిదా వేశారు.