vijayarangaraju: నా కోసం రజనీకాంత్ షూటింగ్ ఆపేశారు: నటుడు విజయరంగరాజు
- రజనీతో సాన్నిహిత్యం వుంది
- నన్ను తప్పించాలనుకున్నారు
- రజనీకి కోపం వచ్చేసింది
విలన్ గా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన విజయరంగరాజు, తాజా ఇంటర్వ్యూలో రజనీకాంత్ గురించి ప్రస్తావించారు. "తమిళంలో నేను రజనీకాంత్ తో కలిసి నటించాను. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒకసారి రజనీ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం నన్ను అడిగారు. 3 రోజులపాటు షూటింగుకు వెళితే సరిపోతుంది. ఆ వేషానికి నేను అడిగిన మొత్తం నిర్మాతలకి పెద్ద అమౌంట్ గా అనిపించింది. దాంతో నన్ను తప్పించి వేరే ఆర్టిస్టును పెడదామని చూశారు.
ముందుగా నన్ను అనుకున్న విషయం రజనీకి తెలుసు. అందువలన ఆయన షూటింగుకి రాగానే నా గురించి అడిగారట. మధ్యాహ్నం తరువాత నుంచి వస్తాడంటూ ఆయనకి ఏదో చెప్పి మేనేజ్ చేశారు. సాయంత్రమైనా నేను సెట్లో కనిపించకపోయేసరికి రజనీ మళ్లీ అడిగారట. నేను డబ్బులు ఎక్కువ అడుగుతున్నానని అప్పుడు వాళ్లు ఆయనతో చెప్పారు. దాంతో రజనీ 'ఈ పాత్రకి విజయరంగరాజునే కావాలి .. ఆయననే పిలిపించండి .. ఆయన డబ్బులు ఎక్కువ అడిగారని అంటున్నారు కదా .. నాకు ఇవ్వవలసిన దాంట్లో కట్ చేయండి' అంటూ షూటింగ్ ఆపేశారు అంటూ చెప్పుకొచ్చాడు.