CBI: అన్ని ఊహాగానాలకూ తెరవేయబోతున్నా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవు
  • ఇకపై కూడా ఉండబోవు
  • మీడియాతో లక్ష్మీ నారాయణ

తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న మొత్తం ప్రచారానికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, ఇకపై కూడా అలాగే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ప్రజల సమస్యలకు ఓ పరిష్కార మార్గం వెతకడమే తన ముఖ్య కర్తవ్యమని తెలిపారు. పాలకులు సమర్థవంతంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా, మరో మూడు రోజుల్లో లక్ష్మీ నారాయణ తాను పెట్టబోయే రాజకీయ పార్టీ గురించిన అన్ని వివరాలూ వెల్లడి కానున్నాయి.

  • Loading...

More Telugu News