: చందనోత్సవానికి తరలివస్తున్న భక్తులు
సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించేందుకు వివిధప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను వేకువజాము 4 గంటల నుంచే అనుమతిస్తున్నప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. అప్పన్న నిజరూప దర్శనం రాత్రి 9 గంటల వరకూ కొనసాగుతుంది.