Tollywood: ‘ఆర్ఆర్ఆర్ షూట్ బిగిన్స్’ అంటూ ఫొటోను షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!

  • నేడు ప్రారంభమైన షూటింగ్
  • రాజమౌళి దర్శకత్వంతో మల్టీ స్టారర్
  • 2020లో విడుదలకు సన్నాహాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామచరణ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’  షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్నివర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ రోజు షూటింగ్ ప్రారంభం సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ కు సంబంధించి ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్.. షూటింగ్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తమకాళ్లను ఒకేచోట పెట్టి ఫొటో తీశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020లో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News