: మనుషులకన్నా మొబైల్సే ఎక్కువట...?


మార్కెట్లో రోజూ బోలెడన్ని మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు పలు ఆఫర్లతో మనల్ని ఆకర్షిస్తుంటాయి. దీంతో మనలో నాలుగైదు కంపెనీల నంబర్లను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మొబైల్స్‌ సంఖ్య మనుషులకన్నా ఎక్కువంటే నమ్ముతారా...? అయితే ఇది నిజం. రానున్న ఏడాదికంతా మొబైల్స్‌ కనెక్షన్ల సంఖ్య ప్రపంచ జనాభాను మించిపోతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలికమ్స్‌ యూనియన్‌ (ఐటీయూ) చెబుతోంది. 2014 ఆరంభానికంతా మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 700 కోట్లను అధిగమిస్తుందని ఐటీయూ అంచనా. నిజమే... మనలోనే ఒక్కొక్కరికి నాలుగైదు కంపెనీల నంబర్లుంటే... మరి మనుషులకన్నా మొబైల్స్‌ ఎక్కువగానే ఉంటాయికదా...!

  • Loading...

More Telugu News