: గుండె జబ్బులు, క్యాన్సర్లకు ఆస్పిరిన్‌ వాడడం ఎలా?


గుండెపోటును నియంత్రించడం, కొలెస్టరాల్‌ పెరుగుదలను నియంత్రించడం, ఇతరత్రా కొన్ని క్యాన్సర్లను అడ్డుకోవడానికి నిర్దిష్టమైన మోతాదులో ఆస్పిరిన్‌ మాత్రలను వాడడం అనేది ఉపయోగపడుతుందని ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆయనతోపాటు ఈ విషయంలో పరిశోదనలు చేసిన మరికొందరు డాక్టర్లు, శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయన ఫలితాల్ని తాజాగా అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

మెదడు లేదా గుండెలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకున్నట్లుగా గుర్తించిన ప్రతి రోగి కూడా.. 325 ఎంజీ మామూలు ఆస్పిరిన్‌ను ప్రతిరోజూ తీసుకోవాలని , తద్వారా మరణానికి దారితీయగల అవకాశాలతో పాటు, తదనంతర గుండెపోటులను కూడా నివారించగలరని శాస్త్రవేత్త హెనెకెన్స్‌ అంటున్నారు.

  • Loading...

More Telugu News