: కొకైన్ వల్ల మరేం భయంలేదు...!?
కొకైన్ కలిసిన మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల ప్రమాదం ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన కొకైన్‌ను మెదడుకు చేరకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఒక టీకాను తయారు చేశామని, ఇది విజయవంతంగా జంతువుల శరీరంలో కొకైన్‌ను అడ్డుకుందని వీల్ కార్నెల్ మెడికల్ కాలేజీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
మానవులు సేవించిన మాదకద్రవ్యాలలోని కొకైన్ మెదడుకు చేరకుండా తాము రూపొందించిన ఈ టీకాను జంతువులపై విజయవంతంగా ప్రయోగించామని, త్వరలో ఇది మానవులపై ప్రయోగించడానికిగాను కీలకమైన అడ్డంకులను అధిగమించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి శరీరంలోకి ప్రవేశించిన కొకైన్‌ను మెదడుకు చేరకుండా అడ్డుకునే ఈ టీకా పనితీరును రేడియలాజికల్ పరిజ్ఞానం ద్వారా పరీక్షించారు.