Hyderabad: పగలు ఎండ, రాత్రి వణికించే చలి... హైదరాబాద్ లో విచిత్ర వాతావరణ పరిస్థితి!

  • పగలు సాధారణం కన్నా అధికం
  • రాత్రికి దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రత
  • 13.8 డిగ్రీలకు రాత్రి ఉష్ణోగ్రత

హైదరాబాద్ లో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా, రాత్రిపూట ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయి వణికిస్తోంది. గడచిన రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో చలితీవ్రత పెరిగింది. గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోయింది. ఇదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలిమొదలై, తెల్లవారుజాముకు పొగమంచు కమ్మేస్తోంది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఇటువంటి విచిత్ర వాతావరణం నెలకొనివుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News