: పాత కొత్త కలయికల మేలు గోధుమ
త్వరలో కొత్త రకం గోధుమ రైతులకు అందుబాటులోకి రానుంది. ఈ రకం గోధుమ వల్ల దాదాపు 30 శాతం మేర దిగుబడి పెరుగుతుందని బ్రిటన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బోటనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాచీన కాలానికి చెందిన గోధుమ వంగడాన్ని ఆధునిక కాలానికి చెందిన గోధుమ వంగడాలతో కలిపి ఒకకొత్తరకం గోధుమ రకాన్ని వృద్ధి చేశామని, దీనిపై జరిపిన పరిశోధనలో పంట చాలా బాగా బలంగా, ఏపుగా పెరిగిందని వీరు చెబుతున్నారు.
ఈ కొత్త రకం గోధుమ పంటపై ఇంకా పలు పరిశోధనలు జరగాల్సి ఉందని, మరో ఐదేళ్ల తర్వాత ఈ రకం గోధుమ పంటను రైతులకు అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోధుమ దిగుబడిని పెంచేందుకు గత 15 ఏళ్ళుగా పరిశోధనలు జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదని, అయితే ఈ రకం వంగడం గోధుమ దిగుబడిని గణనీయంగా పెంచేందుకు దోహదపడుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు కేవలం దిగుబడిపైనే దృష్టి పెట్టకుండా అటు ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకం గోధుమవంగడాన్ని అభివృద్ధి చేస్తే రెండు రకాలుగా కూడా బాగుంటుందేమో...!