Hyderabad: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల బరిలో ఇండిపెండెంట్గా లింగాగౌడ్
- ఆదివారం విలేకరులకు వెల్లడించిన గౌడ్
- లింగాగౌడ్ తెలంగాణ వైన్షాప్స్, బార్వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
- తన సామాజిక వర్గం ఓట్లే 15 వేలని ప్రకటన
తెలంగాణ వైన్ షాప్స్, బార్వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగా గౌడ్ ఎన్నికల బరిలోకి దూకాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించానని తెలిపారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు నియోజక వర్గంలో దాదాపు 15 వేల మంది ఉన్నారని, వీరితోపాటు పలువురు బీసీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.