YSRCP: తెలంగాణకు మేం దూరం... పోటీ చేయబోము : తేల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్
- మీడియాకు వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెరస్ పార్టీ
- జరుగుతున్న పరిణామాలు బేరీజు వేసుకున్నాం
- 2024 నాటికి తెలంగాణలో బలపడతామన్న పార్టీ
మరో నెల రోజుల్లో జరగనున్న తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దృష్టంతా ఏపీలో వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలపైనే ఉందని, అందువల్ల తెలంగాణలో పోటీ పడరాదని నిర్ణయించామని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గత నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన పరిణామాలన్నీ బేరీజు వేసుకున్నామని, ఇదే సమయంలో 2024 నాటికి సంస్థాగతంగా తెలంగాణలో బలపడే చర్యలు చేపట్టనున్నామని కూడా ఈ ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.