: బాలీవుడ్ బాద్షాకు 'శివాజీ గణేశన్' పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు 'శివాజీ గణేశన్' అవార్డు అందజేశారు. నేడు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో షారూఖ్.. నట దిగ్గజం కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు. 2012కు గాను షారూఖ్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ పురస్కారాన్ని శివాజీ గణేశన్ పేరిట ఆయన తనయుడు, ప్రముఖ దక్షిణాది నటుడు ప్రభు అందిస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో తమిళనటుడు విజయ్ తో కలిసి 'గూగుల్ గూగుల్' అనే పాటకు షారూఖ్ చేసిన నృత్యాలు వీక్షకులను అలరించాయి.