: షరీఫ్ గారూ మా దేశం రండి: ప్రధాని మన్మోహన్ ఆహ్వానం


పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీని విజయపథంలో నడిపించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అంతేగాకుండా, భారత్ లో పర్యటించాలంటూ షరీఫ్ ను ఆహ్వానించారు. పాక్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ 125 స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

అయితే, పీఎంఎల్-ఎన్ కు స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో, మిగతా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ 34 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇతరులు 71 స్థానాల్లో విజయం సాధించారు. ఇక అధికార పార్టీ పీపీపీ కేవలం 32 స్థానాలతో సరిపెట్టుకుంది.

  • Loading...

More Telugu News