కర్ణాటక సీఎంకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అత్యధిక మెజార్టీతో ఈ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది.