: అంధకారంలో విజయవాడ


విజయవాడలో భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి ధాటికి చెట్లు, హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈ సాయంత్రం వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్లు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వడగళ్ళవాన కురిసింది. కాగా, పాడేరులో పిడుగుపాటుకు ఓ విద్యార్థి మరణించాడు.

  • Loading...

More Telugu News