: వికలాంగుల దీక్షకు మద్దతుగా 'ఛలో అసెంబ్లీ': మందకృష్ణ


రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, మార్చి 13న 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.

హైదరాబాద్ ఉప్పల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి చేపట్టిన రిలే నిరాహర దీక్షలో ఆయన పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సోనియా గాంధీయే ఒప్పుకున్నారని, ఇకనైనా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మంద కృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News