: తలుపులు బార్లా తెరిస్తే టీడీపీ గల్లంతే: జూపూడి
తెలుగుదేశం పార్టీ తలుపులు మూసి ఉండగానే కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు వంటి నాయకులు గుడ్ బై చెబుతుంటే, ఇక తలుపులు బార్లా తెరిస్తే టీడీపీ ఖాళీ అవడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జూపూడి ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తలుపులు తెరిస్తే టీడీపీలోకి చాలామంది వస్తారంటున్న చంద్రబాబు, తాజా పరిణామాలకు ఏం జవాబు చెబుతారని జూపూడి ప్రశ్నించారు. జగన్ కు బెయిల్ రాకపోవడం వెనుక కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి కుట్ర దాగి ఉందని జూపూడి ఆరోపించారు. జగన్ కు బెయిల్ నిరాకరణ విషయంలో తాను సుప్రీం కోర్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.