manjuvhargavi: 'శంకరాభరణం' తరువాత అంతా నన్ను అపురూపంగా చూసేవారు: మంజుభార్గవి
- 'శంకరాభరణం' పెద్ద హిట్
- తులసి పాత్ర గుర్తింపు తెచ్చింది
- డాన్స్ పైనే శ్రద్ధ పెట్టాను
తెలుగులో వచ్చిన ఆణిముత్యాల వంటి చిత్రాలలో ఒకటిగా 'శంకరాభరణం' కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1980లో విడుదలై ప్రేక్షకులచే నీరాజనాలు అందుకుంది. అలాంటి ఈ సినిమాలో 'తులసి' పాత్రలో మంజుభార్గవి అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమా తరువాత తనకి వచ్చిన గుర్తింపును గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మంజుభార్గవి ప్రస్తావించారు.
'శంకరాభరణం' విడుదలైన తరువాత నేను ఎక్కడికి వెళ్లినా అంతా కూడా అపురూపంగా చూసేవాళ్లు. ఒకసారి నేను వైజాగ్ ప్రోగ్రామ్ కోసం వెళ్లాను. నేను రైలు దిగగానే .. ఒక బెంగాలీ అబ్బాయి అనుకుంటాను .. నాపై రాసిన కవితను నాకు ఇచ్చేసి పరిగెత్తుకెళ్లి ట్రైన్ ఎక్కేశాడు .. ఇప్పటికీ ఆ పేపర్ నా దగ్గర వుంది. 'శంకరాభరణం' పెద్ద హిట్ అయినప్పటికీ నేను సినిమాలపై దృష్టి పెట్టలేదు .. డాన్స్ పైనే శ్రద్ధ పెట్టాను .. అందులోనే నాకు సంతోషం వుందనిపించేది" అని చెప్పుకొచ్చారు.