sukumar: ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తోన్న సుకుమార్

  • చరణ్ కి హిట్ ఇచ్చిన సుకుమార్ 
  • మహేశ్ ను ఒప్పించే ప్రయత్నాలు
  • కథపై జరుగుతోన్న కసరత్తు  

ఇంతవరకూ అల్లు అర్జున్ కి .. ఎన్టీఆర్ కి .. చరణ్ కి సుకుమార్ భారీ హిట్లను అందించాడు. ఈ స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ బాబు కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ ఆయన చెప్పిన కథల పట్ల మహేశ్ బాబు సంతృప్తిని వ్యక్తం చేయలేదు.

ఈ నేపథ్యంలో సుకుమార్ .. ప్రభాస్ పై కూడా దృష్టి పెట్టినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కి ఒక లైన్ వినిపించి ఆయనతో ఓకే అనిపించేసుకుంటే, ఆ తరువాత పూర్తి కథను సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. మహేశ్ .. ప్రభాస్ లలో ముందుగా ఎవరిని ఒప్పించగలిగితే వాళ్లతో సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాను మరో హీరోతో చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ముందుగా ఏ హీరోతో సినిమాను సెట్ చేస్తాడో చూడాలి.  

More Telugu News