: ముఖేశ్ అంబానీ జీతం సంవత్సరానికి రూ.15 కోట్లు!
ఫోర్బ్స్ పత్రిక భారత కుబేరుల జాబితా ఎప్పుడు ప్రకటించినా, టాప్ టెన్ జాబితాలో ఉండే పేరు ముఖేశ్ అంబానీదే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముఖేశ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. లక్షల కోట్ల రూపాయల నెట్ వర్త్ కలిగిన రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరక్టర్ హోదాలో అంబానీ అందుకునే వార్షిక వేతనం రూ.15 కోట్లు.
వాస్తవానికి ఆయనకు రూ. 38.93 కోట్లు అందుకునే వెసులుబాటు ఉంది. అందుకు వాటాదారుల అనుమతి కూడా ఉంది. కానీ, 2009 నుంచి ఆయన పదిహేను కోట్ల రూపాయలే తీసుకుంటున్నారట. వివిధ సంస్థల సీఈవోల వేతనాలు మరీ భారీ స్థాయిలో ఉంటున్న విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో 2009లో ముఖేశ్ అంబానీ తన జీతంలో కోత విధించుకున్నారు.