ED: ఈడీ తాత్కాలిక డైరెక్టర్ గా సంజయ్ కుమార్ మిశ్రా నియామకం

  • రేపటితో ముగియనున్న ప్రస్తుత ఈడీ డైరెక్టర్ పదవీకాలం
  • నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఏసీసీ
  • మూడు నెలలు లేదా పూర్తి స్థాయి డైరెక్టర్ నియామకం వరకూ బాధ్యతలు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్ గా ఇండియన్ రెవెన్యూ కేడర్ కు చెందిన 1984 బ్యాచ్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ పదవీ కాలం రేపటితో ముగిసిపోనుంది. దీంతో క్యాబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలలపాటు లేదా పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించే వరకూ ఈడీ తాత్కాలిక డైరెక్టర్ గా మిశ్రా కొనసాగుతారని ఏసీసీ వెల్లడించింది. 

ED
  • Loading...

More Telugu News