Jagan: జగన్ రక్త నమూనాలో ఎక్కువగా ఉన్న అల్యూమినియం శాతం: వెల్లడించిన వైద్యులు
- వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచన
- కత్తికి విషం పూసి దాడి చేశాడనే అనుమానంతో పరీక్షలు
- లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కత్తికి విషం పూసి దాడి చేశాడేమో అనే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్ ను సేకరించిన వైద్యులు పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు.
ఈ శాంపుల్స్ రిపోర్టు రావడంతో వివరాలను ఈ రోజు వెల్లడించారు. ఇదిలావుండగా జగన్ పై దాడి నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కుట్రలు పన్నుతున్నారని ఒకరిపై మరొకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.