: పొరుగు దేశంలో ప్రజాస్వామ్యం.. మనకు హర్షణీయం
దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం మళ్ళీ వికసించడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా, సైన్యం కనుసన్నల్లో మనుగడ సాగించిన పాక్ లో శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ అత్యధిక స్థానాల్లో జయభేరి మోగించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో, నవాజ్ షరీఫ్ కు పలువురు భారత రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
పాక్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. పాక్ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలాంటి నిర్ణయాన్నైనా స్వాగతిస్తామని విదేశాంగశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, 1999లో ఆగిపోయిన శాంతి ప్రక్రియను మళ్ళీ మొదలెట్టాలని నవాజ్ షరీఫ్ కు సూచించారు.