election commission: ఈసీ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది: మర్రి శశిధర్ రెడ్డి

  • రాష్ట్రంలో ఇంకా బోగస్ ఓట్లు ఉన్నాయి
  • టీఆర్ఎస్ కు జేబు సంస్థగా ఈసీ మారింది
  • పింక్ పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయొద్దు

తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు నియంత్రించడంలో ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయని టీ-కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంకా బోగస్ ఓట్లు ఉన్నాయని, హైకోర్టును ఈసీ తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ విషయమై ఈసీ చర్చకు వస్తే నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీఆర్ఎస్ కు జేబు సంస్థగా ఈసీ మారిందని, కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా తమ షెడ్యూల్ ఉండేలా ఈసీ విశ్వప్రయత్నాలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో పింక్ పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయొద్దని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

More Telugu News