Jagan: చంద్రబాబు మాటలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు: జగన్
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని చంద్రబాబు అన్నారు
- ముఖ్యమంత్రి మీరా? లేక నేనా?
- 50 రోజులు శ్రీకాకుళం జిల్లాలో ఉంటా
శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి తుపాను బాధితులను పరామర్శించలేదంటూ తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కావడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ముఖ్యమంత్రి మీరా? లేక నేనా? అని ప్రశ్నించారు. అధికారం యంత్రాంగం మీ చేతుల్లో ఉందా? లేక నా చేతుల్లో ఉందా? అని అడిగారు. తాను పాదయాత్రలో ఉన్నందువల్ల తమ పార్టీ సీనియర్ నేతలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయక చర్యలను చేపట్టారని అన్నారు. వారం రోజుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్తానని, శ్రీకాకుళం జిల్లాలో 50 రోజులు ఉంటానని చెప్పారు. సాలూరులో ఈరోజు మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.