Andhra Pradesh: తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు

- చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా సంకేతం
- మంచి సంకల్పాలకు దేవతల ఆశీర్వచనాలు లభిస్తాయి
- తెలుగు లోగిళ్లు ఆనందంతో వెల్లివిరియాలి
తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన గెలుపునకు సంకేతమే దసరా అని గుర్తు చేశారు. మంచి సంకల్పాలకు దేవతల ఆశీర్వచనాలు లభించే ఈ శుభ సమయంలో తెలుగు లోగిళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నారు. తిత్లీ తుపాను బాధితుల మధ్యే ఆయన దసరా జరుపుకోనున్నారు. మంత్రి నారా లోకేశ్, మంత్రులు, అధికారులు కూడా జిల్లాలోనే ఉండి తుపాను బాధితుల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.