: బెంగళూరు పేలుళ్ళ కేసులో మరో ఇద్దరి అరెస్టు


బెంగళూరులో ఏప్రిల్ 17న జరిగిన బాంబు పేలుళ్ళ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ బీజేపీ కార్యాలయం ఎదుట ఈ బాంబు పేలుళ్ళు సంభవించాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 13కి చేరింది. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరు తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి చెందిన సల్పికర్ అలీ (22), షబ్బీర్ (24) అని తెలుస్తోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కర్ణాటక, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా వలపన్ని వీరిద్దరిని పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News