ntr: యూఎస్ఏ ప్రీమియర్ షోలు .. దుమ్మురేపేసిన 'అరవింద'

  • తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో 'అరవింద' 
  • యూఎస్ఏ లో ప్రీమియర్ షోల సందడి 
  • అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జోడీ అదిరిందని అభిమానులు అంటున్నారు. ఇటు ఎన్టీఆర్ సినిమాలకి .. అటు త్రివిక్రమ్ మూవీస్ కి యూఎస్ఏ లో మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.

ఈ కారణంగా ఈ సినిమాకి అక్కడ 200లకి పైగా ప్రీమియర్ షోలు వేశారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకూ 194 లొకేషన్స్ లో వేసిన ప్రీమియర్ షోల వలన $707,698 వసూళ్లు వచ్చాయి. మిగతా లొకేషన్స్ వసూళ్లు కలుపుకుంటే, ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విషయం తెలిసిందే.   

More Telugu News