paruchuri: సమంత పాత్రను అక్కడ పరిచయం చేయడం కరెక్ట్ కాదు: పరుచూరి గోపాలకృష్ణ

- రాంగ్ టైమ్ లో సమంత ఎంట్రీ
- ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు
- ఆమె ఎంట్రీ అంతకుముందే జరగాల్సింది
ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'బ్రహ్మోత్సవం'లోని కొన్ని సన్నివేశాలను మరోలా కూడా మార్చవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సమంత పాత్ర ఎంట్రీ గురించి ఆయన ప్రస్తావిస్తూ .. "సత్యరాజ్ పాత్ర చనిపోయి ఆ కుటుంబమంతా దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో సమంత పాత్రను దింపారు. ఆ సమయంలో సమంత వచ్చేసి తనదైన స్టైల్లో గలగలా మాట్లాడుతూ వుంటే, దుఃఖంలో వున్న ఆడిటోరియం సమంత పాత్రను రిసీవ్ చేసుకోలేకపోయింది.
