vijay devarakonda: అందుకే 'నోటా'ను ఎంచుకున్నాను: విజయ్ దేవరకొండ

- నాకు రాజకీయాలంటే ఆసక్తి
- కొత్తదనం అంటే ఇష్టం
- అందుకే ఈ ఛాన్స్ వదల్లేదు
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'నోటా' చిత్రం రూపొందింది. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఇది ద్విభాషా చిత్రంగా నిర్మితమైంది. సమకాలీన రాజకీయాలను సహజంగా ఆవిష్కరించే సినిమా ఇది.
"తమిళ రాజకీయాలకి దగ్గరగా .. చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి వుంది. అందుకే ఈ పొలిటికల్ స్టోరీని ఎంచుకున్నాను. కాస్త ఆలస్యమైనా ప్రేమకథా చిత్రాలను చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి .. అందువల్లనే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. మీరు ఈ సినిమా చూసిన తరువాత కొత్తదనం కోసం నేను ఎంతగా ట్రై చేశానేది అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చాడు.