: ఎమోషన్స్ రుద్దితే ఎవరూ చూడరు: నాగార్జున


టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నటించిన చిత్రం 'గ్రీకువీరుడు'. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం ప్రజాదరణ సొంతం చేసుకుంది. కాగా, ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా నాగార్జునతో ఓ చానల్ పిచ్చాపాటీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులతో నాగార్జున తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'గ్రీకువీరుడు' చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించాలన్నది చిత్ర బృందం నిర్ణయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎమోషన్స్ రుద్దితే సినిమాను ఎవరూ చూడరని నాగ్ అభిప్రాయపడ్డారు. అందుకే, రొమాన్స్, కామెడీలకు పెద్దపీట వేశామని తెలిపారు. సినిమాలో కామెడీ కూడా కథతోపాటే నడుస్తుందని, ఆ క్రెడిట్ అంతా దర్శకుడు దశరథ్ కే చెందుతుందని నాగార్జున పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News