canada: కశ్మీర్ టెర్రరిస్టులకు నిధులు ఇస్తున్న ముస్లిం సంస్థపై ఉక్కుపాదం మోపిన కెనడా!

  • ఐఎస్ఎన్ఏ-కెనడాపై ఏడాది నిషేధం
  • 5,50,000 డాలర్ల జరిమానా
  • రిలీఫ్ ఆర్గనైజేషన్ ఫర్ కశ్మీరీ ముస్లింస్ సంస్థకు నిధులు  

టెర్రరిస్టులను, వారికి సాయం చేసే వ్యక్తులు, సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కెనడా హెచ్చరించింది. కశ్మీర్ లో నెత్తురు ఏరులు పారిస్తున్న ఓ టెర్రరిస్ట్ సంస్థకు ఆర్థిక సాయం చేసిందనే కారణంతో తమ దేశంలోని ఓ ముస్లిం ఛారిటీపై కెనడా చర్యలు తీసుకుంది. ఛారిటీపై జరిమానా విధించింది. 1,36,000 డాలర్లను టెర్రరిస్టు సంస్థకు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

రష్యా మీడియా సంస్థ స్పుత్నిక్ కథనం ప్రకారం... ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా-కెనడా (ఐఎస్ఎన్ఏ-కెనడా)పై ఏడాది పాటు కెనడా నిషేధం విధించింది. సెప్టెంబర్ 12 నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, ఆ సంస్థపై ఏకంగా 5,50,000 డాలర్ల జరిమానా విధించింది. రిలీఫ్ ఆర్గనైజేషన్ ఫర్ కశ్మీరీ ముస్లింస్ (ఆర్వోకేఎం) సంస్థకు ఐఎస్ఎన్ఏ-కెనడా 90వేల డాలర్లను ఇచ్చింది. దీనికి తోడు కశ్మీరీ రిలీఫ్ ఫండ్ ఆఫ్ కెనడాకు మరో 46వేల డాలర్లను అందజేసింది. ఈ మొత్తాన్ని కూడా రిలీఫ్ ఆర్గనైజేషన్ ఫర్ కశ్మీరీ ముస్లింస్ సంస్థ స్వీకరించింది. జమాత్-ఏ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థకు రిలీఫ్ ఆర్గనైజేషన్ ఫర్ కశ్మీరీ ముస్లింస్ ఒక ఛారిటబుల్ వింగ్ గా వ్యవహరిస్తోంది. ఆర్వోకేఎం పాకిస్థాన్ లో ఒక పొలిటికల్ పార్టీగా కూడా ఉంది. 

More Telugu News