: సీబీఐ, ఈడీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
తన సోదరుడు జగన్ జైలు పాలవడానికి కారణం సీబీఐ, ఈడీలే అని గట్టిగా నమ్ముతున్న షర్మిల నేడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలు కేంద్రం పెరట్లోని పెంపుడు కుక్కలని పేర్కొన్నారు. ముఖ్యంగా సీబీఐ కేంద్రం ఎవరిని కరవమంటే వారిని కరిచే కుక్కలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీల ఆటలు సాగవని, అందుకే, సీబీఐని ఉసిగొల్పి జైలుపాలు చేశారని ఆరోపించారు. సీబీఐ ఓ బ్లాక్ మెయిలింగ్ సంస్థలా మారిందని ఆమె విమర్శించారు.