: ఇరాన్ అధ్యక్ష పదవి రేసులో వందలాది మంది
ఇరాన్ అధ్యక్షుడు ముహ్మద్ అహ్మదీ నెజాద్ పదవీకాలం ముగియనుండడం, రాజ్యాంగాన్ని అనుసరించి ఆయన మరోసారి పోటీ పడే అవకాశం లేకపోవడంతో.. ఇరాన్ లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడి కోసం జూన్ 14న ఈ ఎన్నికలు జరుగుతాయి. నేడు నామినేషన్లకు తుది గడువుకాగా, ఇప్పటివరకు 366 మంది అధ్యక్ష పదవికి రేసులోకొచ్చారు. వీరందరిలోకెల్లా ప్రముఖ నేతలు రఫ్సంజాని, మొహిసన్ రెజాయ్, మహ్మద్ రెజా ఆరిఫ్, అలీ రెజా జఖాని, గులామ్ అలీ హద్దాద్ అదిల్ ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.