shakalakashankar: 'ఖైదీ'గా షకలక శంకర్ .. త్వరలో సెట్స్ పైకి
- కమెడియన్ గా మంచి గుర్తింపు
- హీరోగా గట్టి ప్రయత్నాలు
- సరైన హిట్ కోసం వెయిటింగ్
ఇటు బుల్లితెరపైన .. అటు వెండితెరపైన కామెడీతో సందడి చేస్తూ షకలక శంకర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒక వైపున కామెడీ వేషాలను వదులుకోకుండానే, మరో వైపున హీరోగా కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. అలా తాజాగా ఆయన హనుమాన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు.
శ్రీనివాసరావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'ఖైదీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే పాటల రికార్డింగును పూర్తిచేసుకున్న ఈ సినిమాను దసరాకి లాంచ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికల పేర్లను త్వరలోనే ఖరారు చేయనున్నారు. హీరోగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న షకలక శంకర్ కి, ఈ సినిమాతోనైనా హిట్ దొరుకుతుందేమో చూడాలి.