: నెత్తురోడిన పాక్.. ముగిసిన ఎన్నికలు
పాకిస్తాన్ లో ఎన్నికలు హింసాత్మక ఘటనల మధ్య ముగిశాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు ఉగ్రవాద దాడుల్లో 16 మంది మరణించారు. కాగా, ఎన్నికలకు నిర్ణీత గడువు సాయంత్రం 5 గంటలు కాగా, ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల బయటే బారులు తీరి ఉండడంతో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ఆరంభిస్తారు. ఈ రాత్రికి ఫలితాలు వెల్లడవుతాయి.