TRS: అక్టోబర్ 11 తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ నేత డీఎస్
- పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా
- టీఆర్ఎస్ లో మా అనుచరులు ఇమడలేకపోతున్నారు
- కాంగ్రెస్ లో తిరిగి చేరబోతున్నా..గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే
టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్ లో మున్నూరు కాపు సంఘం నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ, అక్టోబర్ 11 తర్వాత తన ఎంపీ పదవికి, ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖలు సమర్పిస్తానని అన్నారు. టీఆర్ఎస్ లో తన అనుచరులు ఇమడలేకపోతున్నారని, తాను పార్టీ మారే విషయంలో తనపై అనుచరుల ఒత్తిడి చాలా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను తిరిగి చేరబోతున్నానని, గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని చెప్పారు.