: హవాలా గుట్టు రట్టు


హైదరాబాదు టాస్క్ ఫోర్సు పోలీసులు ఈ రోజు ఓ హవాలా రాకెట్ ను ఛేదించారు. పక్కా సమాచారంతో వలపన్ని నిందితులను అరెస్టు చేసి, కోటీ 25 లక్షల 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ అబిడ్స్ సురభీ ఆర్కేడ్ లో అంకిత్ జైన్, రమాకాంత్ అనే వ్యక్తులు గత తొమ్మిది నెలలుగా హవాలా ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ వ్యాపారం చేస్తున్నారు. వీరు విశాఖపట్టణం, భీమవరం, విజయవాడ, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ వ్యాపారం సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News