: తదుపరి పోప్ ఎవరు?
అనారోగ్యంతో పోప్ బెనడిక్ట్-16 తన పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త పోప్ ఎవరన్న అంశం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్ అరింజ్, ఘనాకు చెందిన పీటర్ టర్క్ సన్, కెనడాకు చెందిన మార్క్ ఔలెట్ వంటి వారి పేర్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి.
అయితే వీరిలో పోప్ పదవిని దక్కించుకునే అవకాశం ఫ్రాన్సిస్ అరింజ్ కే ఎక్కువగా ఉందని లండనులోని విలియం హిల్ బుక్ మేకర్స్ సంస్థ తెలిపింది. పోప్ జాన్ పాల్-2 మరణించినపుడు కూడా అరింజ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. రాట్జింగర్ పోప్ అయిన తర్వాత కూడా అరింజ్ దాదాపు ఆ స్థానం వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పోప్ వారసుడిగా అరింజ్ కే ఎక్కువ అవకాశం ఉందని విలియం హిల్ బుక్ మేకర్స్ ప్రతినిధి అంటున్నారు.