arjun reddy: తమిళ్ అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల!

- వర్మ పేరుతో తెరకెక్కుతున్న సినిమా
- హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్
- ఈ రోజు ఉదయం 11 గంటలకు టీజర్ విడుదల
అర్జున్ రెడ్డి.. బోల్డ్ కంటెంట్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన సినిమా. తాజాగా దీన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా, మేఘా చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వర్మ’గా టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు విజేత రాజు మురుగన్ డైలాగులు రాస్తున్నారు. తాజాగా వర్మ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.