babli: ధర్మాబాద్ కోర్టులో విచారణ.. చంద్రబాబు తరపున వారెంట్ రీకాల్ పిటిషన్ వేసిన లాయర్!

  • బాబ్లీ ప్రాజెక్టు అంశంపై కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • సమయం లేకపోవడంతో కోర్టుకు హాజరుకాని చంద్రబాబు
  • సీఎం తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ జి.సుబ్బారావు

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు విచారణకు చంద్రబాబు హాజరుకాలేదు. కోర్టుకు హాజరయ్యేందుకు తనకు సమయం లేదని పేర్కొంటూ, ముఖ్యమంత్రి తన తరపున లాయర్ ను పంపించారు. ఆయన తరపున లాయర్ జి.సుబ్బారావు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలంటూ సుబ్బారావు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, రీకాల్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు, అరెస్ట్ వారెంట్లు అందుకున్న మరో 15 మందిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్, కేఎస్ రత్నంలు కోర్టుకు హాజరయ్యారు.

More Telugu News