Leesare: కవల పిల్లలకు తల్లైన బాలీవుడ్ నటి లీసారే

  • సరోగసీ ద్వారా తల్లైన లీసారే
  • క్యాన్సర్‌ను జయించి మిత్రుడితో వివాహం
  • రోగాలను ధైర్యంగా ఎదుర్కోవాలంటున్న లీసారే

మోడల్, బాలీవుడ్ హీరోయిన్ లీసారే కవల పిల్లలకు తల్లైంది. క్యాన్సర్‌ను జయించిన ఈ ముద్దుగుమ్మ తన మిత్రుడు జాసన్ దేహ్నిని పెళ్లాడి.. ఇప్పుడు కవల ఆడపిల్లలకు అమ్మ అయింది. అంతే కాదు, ఆ కవలలను ఆమె సరోగసి ద్వారా పొందింది. ప్రస్తుతం తన కవలపిల్లలతో జార్జియాలో వున్న ఆమె ఇండియాకు రాగానే, ఆ చిన్నారులిద్దరినీ మనకు పరిచయం చేస్తుందట.  

ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న లీసారే.. క్యాన్సర్ బారిన పడిన దగ్గర నుంచి తల్లయ్యేంత వరకూ అన్ని విషయాలను తెలియజేస్తానని చెప్పింది. రోగాల బారిన పడినంత మాత్రాన జీవితాన్ని కోల్పోయినట్టు కాదని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సందేశం ఇస్తోంది. వైద్య రంగంలో వచ్చిన మార్పుల కారణంగా నేడు ఏదైనా సాధ్యమేనని... దీనికి తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. కూతుళ్ల రూపంలో తన భర్త తనకు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చాడని లీసారే నవ్వుతూ చెబుతోంది.

  • Loading...

More Telugu News