: చిత్రరూపం దాల్చిన కరుణానిధి నవల


తమిళనాడు సీనియర్ రాజకీయవేత్త, డీఎంకే అధినేత కరుణానిధి పూర్వాశ్రమంలో చేయి తిరిగిన సినీ రచయిత అన్న సంగతి తెలిసిందే. కరుణానిధి రాసిన పలు స్క్రిప్టులతో తమిళ సినీ దిగ్గజం ఎంజీ రామచంద్రన్ భారీ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. కరుణానిధి అప్పట్లో రాసిన 'పొన్నార్ శంకర్' అనే నవలను తాజాగా ప్రశాంత్ హీరోగా తెరకెక్కించారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమైన ఈ చిత్రానికి త్యాగరాజన్ దర్శకుడు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ప్రశాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో స్నేహ, పూజా చోప్రా, దివ్య పరమేశ్వరన్ హీరోయిన్లు. ప్రభు, ప్రకాశ్ రాజ్, నాజర్, నెపోలియన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న మన రాష్ట్రంలో విడుదల కానుంది. తెలుగు అనువాదానికి 'రాజకోట రహస్యం' అనే పేరు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News