: మావో ఫొటోకు భలే ధర


ప్రపంచ కమ్యూనిజానికి కార్ల్ మార్క్స్ రూపమిచ్చినవాడైతే, దానికి ఊపిర్లూదినవాళ్ళలో మావో జెడాంగ్ అతి ముఖ్యుడు. అంతటి ఘనచరిత ఉన్న ఈ చైనా కమ్యూనిస్టు పిత ఫొటో ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. సమున్నతమైన లుషాన్ పర్వతాల నేపథ్యంలో కుర్చీలో తీరుబడిగా కూర్చున్న మావో ఫొటోను వేలం వేయగా, 3.03 లక్షల రూపాయల ధర లభించింది. ఈ ఫొటోను 1961లో మావో భార్య తీశారట. శుక్రవారం బీజింగ్ లో ఈ వేలం నిర్వహించగా, ఈ ఫొటో ప్రారంభ ధరకు పది రెట్లు ధర పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

  • Loading...

More Telugu News