hero ram: మల్టీ స్టారర్‌కు సంతకం చేసిన రామ్?
- ‘హలో గురు ప్రేమకోసమే’ షూటింగ్లో బిజీగా ఉన్న రామ్
- హిట్ కొట్టిన దర్శకుడితో మల్టీ స్టారర్
- త్వరలో అధికారిక ప్రకటన
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో 'దేవదాస్'.. మరోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో 'ఎఫ్2' సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరోపక్క, ఇప్పటికే వెంకీ, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో 'వెంకీ మామ' చిత్రాన్ని ప్రకటించారు. ఇవికాక మరికొన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులు సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
తాజాగా యువ కథా నాయకుడు రామ్ కూడా ఓ మల్టీ స్టారర్లో కనిపించనున్నాడనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్న రామ్.. కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసేశాడట. అది మల్టీస్టారర్ అని, దానికి దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఇటీవలే ఓ పెద్ద హిట్ అందుకున్నారని వార్తలు వినవస్తున్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందట.